బేబీని వీక్షించిన ప్రేక్షకుడి ఇన్నర్ ఫీలింగ్

నిన్న జులై 14 న విడుదలైన బేబీమూవీకి ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడమే కాదు.. మొదటి రోజు 7 కోట్ల గ్రాస్ తో ఆహా అనిపించింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ ని ఆడియన్స్ ఖచ్చితంగా హిట్ చేసేలా కనబడుతుంది. లేదంటే ఓపెనింగ్స్ ఆ రేంజ్ లో రావడం మామూలు విషయం కాదు. కొంతమంది బేబీ చూసి మిక్స్డ్ రెస్పాన్స్ ఇస్తూ ఉండగా.. కొంతమంది మాత్రం బేబీ బావుంది.. చివరి 15 నిమిషాల క్లైమాక్స్ కూడా బావున్నట్టయితే బేబీ బిగ్గెస్ట్ హిట్ అయ్యేది అంటున్నారు. ఇక బేబీ ని వీక్షించడం ఓ ప్రేక్షకుడి ఇన్నర్ ఫీలింగ్ మీరూ చూడండి..

పడుకుందని ప్రేమించినోడొదిలేశాడు..

ప్రేమించిందని పడుకున్నోడొదిలేశాడు..

కానీ.. కానీ.. ప్రేమించిందని.. పడుకుందని తెలిసికూడా.. పెళ్లి చేసుకున్నాడే..

ఏం గుండెరా వాడిది..

వాడు బతకాలి.. వాడు బతకాలి.. వాడు బతకాల్రా..😂

బేబీ సినిమా చూసి బయటికొస్తున్నోళ్ల ఇన్నర్ ఫీలింగ్ ఇది.. 😂

అబ్బాయిలకి అమ్మాయిల వల్ల డేంజర్..

అమ్మాయిలకి అమ్మాయిల వల్లే డేంజర్..

రెండుముక్కల్లో ఇదే బేబీ కథ..

ఏమాటకామాటే చెప్పాలి.. బాదీశాడబ్బా డైరెట్రూ…

సీన్స్ భలే రాస్కున్నాడు..

అదేదో అనుభవించి రాసుకున్నట్టున్నాయ్..

ఏవో అనుకున్నా గానీ ఆనంద్ దేవరకొండ మామూలు యాక్టర్ కాదబ్బా.. ఇరగదీశాడు..

కొత్తమ్మాయ్ వైష్ణవైతే చించేసింది..

కాస్త ల్యాగ్ అనిపించినా సినిమా బావుంది..

సినిమా చూశాక అప్పుడెప్పుడో EVV గారి సినిమాలో  డైలాగ్ గుర్తొచ్చింది..

లంగా వెళ్లి లుంగీ మీద పడ్డా..

లుంగీ వెళ్లి లంగా మీద పడ్డా..

చినిగేది లుంగీనే గానీ లంగా కాదు.. 🙏🏼

మొత్తంగా డైరెట్రు చెప్పిందిదే..😂

అమ్మాయిల చేతుల్లో చితికిపోవడం కంటే.. చచ్చి చితికి పోవడం మేలు..

ఇది చివరిగా డైరెట్రిచ్చిన సందేశం..

చూడండి సినిమా బావుంది..

Source link