బేబీ.. రిపోర్ట్స్ బాగున్నాయ్..

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘బేబీ’. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఈ సినిమా కూడా ఒకటి. ఎందుకంటే ఈ సినిమాకు ప్రమోషన్స్ అలా నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే విడుదలైన పాటలు, ట్రైలర్ కూడా ప్రేక్షకులని అలరించాయి. దీంతో మాములుగానే అంచనాలు మొదలయ్యాయి. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.కే.ఎన్ నిర్మించారు. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు అన్ని చోట్ల మంచి రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. 

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించారు. సినిమా చూసిన వాళ్లంతా ఎమోషనల్ అవుతూ.. సినిమా అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాస్త లెంగ్తీ‌గా ఉందీ కానీ, ప్రతి డైలాగ్ పేలిందని అంటున్నారు. ముఖ్యంగా మెయిన్ పాత్రలలో నటించిన ముగ్గురూ.. తమ నటనతో మెస్మరైజ్ చేశారనేలా టాక్ బయటికి వచ్చేస్తుంది. ఈ రిపోర్ట్స్ చూసిన నిర్మాత తన ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా.. ఈ సినిమాపై ఎవరేం మాట్లాడుతుందీ ప్రతీది రీ ట్వీట్ చేస్తూ.. తన సంతోషాన్ని తెలియజేస్తున్నారు. 

ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్‌కి వచ్చిన స్పందన చూసి.. అందరికీ పాద నమస్కారం చేశారు నిర్మాత SKN. అందరికీ పాద నమస్కారం. సినిమాకి వస్తున్న రెస్పాన్స్.. మీ కాల్స్, మెసేజెస్, ట్వీట్స్ వంటివన్నీ నాకు ఎంతో హై ని ఇస్తున్నాయి. కల్ట్ అనే మెసేజెస్ చూస్తుంటే గూజ్‌బంప్స్ వస్తున్నాయి. సంతోషంలో కళ్లవెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. మంచి సినిమాలు తీస్తా.. లవ్ యు ఆల్. దర్శకుడు సాయి రాజేష్.. నువ్వు తోపురా భాయ్.. అంటూ SKN తన ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా సందడి చేయబోతుందో తెలియజేస్తుంది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది కాసేపట్లో మన రివ్యూలో తెలుసుకుందాం..

Source link