భ‌క్తుల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌, విశాఖ‌ప‌ట్నం నుంచి పంచ వైష్ణ‌వ క్షేత్ర ద‌ర్శినికి ప్ర‌త్యేక బ‌స్సులు..-rtc good news for devotees special buses from visakhapatnam for pancha vaishnava kshetra darshini ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

డిసెంబ‌ర్ 1న పంచారామ క్షేత్రాల‌కు చివ‌రి స‌ర్వీస్‌

డిసెంబ‌ర్ 1 తేదీన పంచారామ క్షేత్రాల ద‌ర్శినానికి బ‌స్సు స‌ర్వీసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. బస్సులు ద్వారకా బస్సు కాంప్లెక్స్ నుండి బయలుదేరి పంచారామాలైన అమ‌రావ‌తి (అమ‌రేశ్వ‌రుడు), భీమ‌వ‌రం (సోమేశ్వ‌రుడు), పాల‌కొల్లు (క్షీర‌రామ‌లింగేశ్వ‌రుడు), ద్రాక్షారామం (భీమేశ్వ‌రుడు), సామ‌ర్ల‌కోట (కొమ‌ర లింగేశ్వ‌రుడు) పుణ్య‌క్షేత్రాల‌ను సోమ‌వారం నాడు ద‌ర్శనం పూర్తి చేసుకుంటారు. అనంత‌రం మ‌ళ్లీ తిరిగి సోమవారం రాత్రికి ద్వారకా కాంప్లెక్స్‌కు బ‌స్సులు చేరుకుంటాయని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 35 బ‌స్సులు పంచారరామాల‌కు న‌డిపామ‌ని తెలిపారు. డిసెంబ‌ర్ 1 తేదీన న‌డిపి స‌ర్వీసులే చివ‌రివ‌ని పేర్కొన్నారు.

Source link