ఇవన్నీ పక్కనపెడితే.. టీమిండియాను వేధించే సమస్య ఒకటి ఎప్పటి నుంచో ఉంది. దానికి ఇంకా సమాధానం దొరకలేదు. ప్రపంచ క్రికెట్‌కు ఎందరో దిగ్గజ ఆటగాళ్లను అందించింది టీమిండియాలో ఓ సమస్య మాత్రం అలాగే ఉంటుంది. కపిల్ దేవ్ నుంచి గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ.. ఇలా ఎందరో టీం ఇండియా ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్‌లో తమదైన ముద్రు వేసుకున్నారు. టీమ్ ఇండియాలో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, ఆల్ రౌండర్లలో చాలా మంది ప్రతిభ కలిగిన ఉన్నారు. అయితే బౌలర్ల విషయానికి వస్తే మాత్రం భారత్‌కు సమస్య తప్పడం లేదు.