నలుగురిపై కేసు నమోదు..
భూవివాదం నేపథ్యంలోనే తన భర్త హత్య జరిగినట్లు రాజలింగమూర్తి భార్య సరళ ఫిర్యాదు చేశారని.. భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు వివరించారు. పింగిలి శ్రీమంత్, రేణుకుంట్ల సంజీవ్, మోరే కుమార్, కొత్తూరు కుమార్, రేణుకుంట్ల కొమరయ్యపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే.. హత్యకు రాజకీయ కారణాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అదుపులో ఉన్న నిందితుల సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలుసుకున్నట్లు తెలుస్తోంది.