కేసు నమోదు
ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన బీఆర్ఎస్ నాయకులు టీచర్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించినా, వినకుండా తన చెప్పుతో ఎల్ఈడీ స్క్రీన్ పై గంగుల కమలాకర్ ఫొటోను కొడుతుండడంతో ఆగ్రహించిన నాయకులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై గోపాలపురం గ్రామానికి చెందిన అరె ప్రశాంత్ కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశాంత్ ఫిర్యాదు మేరకు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎల్ఈడీ స్క్రీన్ పై దాడి చేసిన ప్రభుత్వ టీచర్ పై కేసు నమోదు అయింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన జగదీశ్వరాచారిపై ఐపీసీ సెక్షన్ 290బి, 290, 504 సెక్షన్లలో పోలీసులు కేసు నమోదు చేశారు.