మంత్రి రోజాకు సన్నీ లియోన్ కౌంటర్, వైరల్ ట్వీట్ లో వాస్తవమెంత?-bollywood actress sunny leone counter comments on minister rk roja viral tweet fact check

Rk Roja Vs Sunny Leone : సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, మంత్రులు వెంటనే కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా పవన్ పై విరుచుకుపడిన మంత్రి రోజా…నోరు జారారు. పవన్ ను విమర్శించే క్రమంలో సన్నీ లియోన్ పై అభ్యంతకరంగా మాట్లాడారు. పవన్ నీతులు చెప్పడం సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి రోజా అన్నారు. పవన్ ను విమర్శించే తొందరలో సన్ని లియోన్ ను తక్కువ చేసి మాట్లాడారు. మంత్రి రోజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ సన్నీకి సపోర్టుగా మంత్రి రోజాపై ఫైర్ అవుతున్నారు. పోర్న్ స్టార్ అయినా… తన జీవితాన్ని మార్చుకుని బాలివుడ్ లో నటిగా కొనసాగుతున్నారని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్నారని నెటిజన్లు సన్నీ లియోన్ కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. పోర్న్ స్టార్ అని ఎగతాళి చేసిన వాళ్లే ఆమెతో కలిసి నటించారని, అవకాశాలిచ్చి పోత్సహించారని నెటిజన్లు అంటున్నారు.

Source link