మగబిడ్డ కోసం అత్తమామల వేధింపులు, ఇద్దరు కూతుళ్లతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య-chittoor crime mother committed suicide with two child mother in law demands baby boy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

అత్తమామ‌ల వేధిస్తుంటే, క‌ట్టుకున్న భ‌ర్త ఎటువంటి మ‌ద్దతు ఇవ్వలేదు. దీంతో కుంగిపోయిన రాణి త‌న ఇద్దరు పిల్లలు హిమ‌శ్రీ‌, జోష్మితలతో క‌లిసి ఆదివారం ఉద‌యం ప‌ట్రప‌ల్లెలోని బావిలోకి దూకి ఆత్మహ‌త్య చేసుకుంది. రాణి తండ్రి వెంక‌ట‌ర‌మ‌ణ అత్తమామ‌ల పోరు, డ‌బ్బలు డిమాండ్‌ భ‌రించ‌లేక‌నే త‌న కుమార్తె ఆత్మహ‌త్య చేసుకుంద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. త‌న కుమార్తెను నిత్యం వేధింపులకు గురి చేశార‌ని ఆరోపించారు. త‌న స‌మ‌స్యల‌ను క‌న్నవాళ్లకు చెప్పుకోలేక‌, దిగిమింగ‌లేక‌నే ఆత్మహ‌త్య చేసుకుంద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. త‌న కుమార్తెకు వ‌చ్చిన బాధ మ‌రెవ్వరికీ రాకూడ‌ద‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు, కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. స‌మాచారం అందుకున్న పోల‌లీసులు ఘ‌ట‌నా స్థలాన్ని ప‌రిశీలించారు. మూడు మృత‌దేహాల‌ను బావి నుంచి బ‌య‌ట‌కు తీశారు. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాణి అత్తమామ‌ల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేశారు.

Source link