Kachidi Fish :కాకినాడ మత్స్యకారుల వలకు 25 కిలోల కచ్చిడి చేప చిక్కింది. ఈ చేప వేలంలో అక్షరాలా రూ.3 లక్షల 30 వేలు పలికింది. కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద 25 కిలోల కచ్చిడి చేపను మత్స్యవ్యాపారి వేల వేశాడు. వేలంలో ఈ చేప 3 లక్షల 30 వేలు ధర పలికింది. ఈ చేప లోపల ఉండే బ్లాడర్‌కి అత్యంత డిమాండ్ ఉండడంతో ఇంత ఎక్కువ ధర వస్తుందని మత్స్యకారులు చెప్తున్నారు. సముద్రంలో చాలా అరుదుగా కచ్చిడి చేప దొరుకుతుందంటున్నారు. అనేక వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో ఈ కచ్చిడి చేపను వాడతారని తెలుస్తోంది. పిత్తాశయం, ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులకు మందులు తయారీకి చేప లోపల ఉండే బ్లాడర్ ను ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు. గతంలోనూ ఇదే తరహాలో అమ్ముడుపోయినా, ఏకంగా మూడు లక్షల ధర పలకడం ఇదే తొలిసారని మత్స్యకారులు చెబుతున్నారు.