sexual assault: స్నేహం పేరుతో దగ్గరై అదను చూసి కాటేసిన ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగింది. ఏలూరు జిల్లాకు చెందిన మైనర్ బాలిక ప్రభుత్వ హాస్టల్ ఉంటూ చదువుకుంటోంది. ఆమెతో పరిచయం పెంచుకున్న స్థానిక యువకుడు స్నేహమంటూ మాటలు కలి పాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. సరదాగా తిరిగి వద్దామని చెప్పి, వెంట వచ్చిన బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.