మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు

Myanmar Earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మయన్మార్ లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.

ఇటీవల 7కి పైగా తీవ్రతతో భారీ భూకంప సంభవించడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఆ భూకంపంలో 4 వేలకు పైగా మృతిచెందారు. వేలాది మంది గాయపడ్డారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిధిలాల కింద నాలుగైదు రోజుల తరువాత సైతం కొందరు ప్రాణాలతో బయటపడ్డ వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి పలుచోట్ల భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కిచిక్కుమంటూ గడుపుతున్నారు.

 

 

మరిన్ని చూడండి

Source link