మరోమారు వీరమల్లు వాయిదా-కొత్త డేట్ లాక్


Fri 14th Mar 2025 09:09 AM

hari hara veera mallu  మరోమారు వీరమల్లు వాయిదా-కొత్త డేట్ లాక్


Hari Hara Veera Mallu new Release Date anounced మరోమారు వీరమల్లు వాయిదా-కొత్త డేట్ లాక్

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మరోసారి వాయిదా పడింది. నిన్నటివరకు మార్చ్ 28 నే హరి హర వీరమల్లు రిలీజ్ అంటూ నిర్మాతలు చెప్పినప్పటికి.. ఇంకాస్త షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో దానిని పోస్ట్ పోన్ చెయ్యక తప్పలేదు. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్న విషయం తెలిసిందే. 

పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్స్ వలన వీరమల్లు షూటింగ్ సక్రంగా జరగడం లేదు, దానితో పదే పదే వీరమల్లు డేట్స్ మార్చుకుంటూ వెళుతుంది. తాజాగా హరి హర వీరమల్లు మార్చి 28 నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా ప్రకటించడమే కాదు హోలీ స్పెషల్ గా పోస్టర్ వదులుతూ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు మేకర్స్. 

హరి హర వీరమల్లు చిత్రం మే 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చెయ్యనుననట్లుగా మేకర్స్ సరికొత్త హోలీ పోస్టర్ తో అనౌన్సచేసారు. దానితో పవన్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయయింట్ అవుతున్నారు. పదే పదే రిలీజ్ తేదీ మారడంతో ఫైనల్ గా మే 9 కైనా ఖచ్చితంగా వస్తుందా అనేది వారి టెన్షన్. 


Hari Hara Veera Mallu new Release Date anounced :

 Hari Hara Veera Mallu new Release Date Poster





Source link