ByGanesh
Thu 30th Jan 2025 01:28 PM
కంటెంట్ ను నమ్మి సినిమాలు చేసి మీడియమ్ రేంజ్ లో బిగ్ హిట్స్ కొట్టే ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఆయన జెడ్జ్మెంట్ కి ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. కొన్నాళ్లుగా దిల్ రాజు జెడ్జ్మెంట్ పై ప్రేక్షకుల్లో సందేహాలు నెలకొంటున్నాయి. దిల్ రాజు మొదటి సారి బిగ్ బడ్జెట్ తో పాన్ ఇండియా ఫిలిం గా గేమ్ చెంజర్ చేసారు.
రామ్ చరణ్ తో శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు గేమ్ చేంజర్ నిర్మించారు. అంతకుముందే దిల్ రాజు శంకర్ తో ఇండియన్ 2 ని నిర్మిస్తానని చెప్పి మధ్యలోనే ఆ ప్రోజెక్టు నుంచి తప్పుకుని మంచి పని చేసారు. అనుకున్నంతలోనే.. రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ లాక్ చేసి ఇరుక్కున్నారు.
గేమ్ చేంజర్ కు శంకర్ చెప్పిన బడ్జెట్ పెట్టుకుంటూ వెళ్లారు. దిల్ రాజు అవుట్ ఫుట్ చూసి జెడ్జ్ చేస్తేనే అది రిలీజ్ అయ్యేది. కానీ గేమ్ చేంజర్ విషయంలో శంకర్ దిల్ రాజుకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. రిలీజ్ డేట్ కూడా దిల్ రాజు చేతుల్లో లేకుండా చేసారు. ఆ చిత్రం విడుదలయ్యింది.. దిల్ రాజు కు బ్యాండ్ వేసింది. గేమ్ చేంజర్ నష్టాలు లెక్కెట్టుకోవడానికి దిల్ రాజుకు చాలా సమయమే పడుతుంది.
అది చూసాక మరోసారి మరో పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేసే ధైర్యం దిల్ రాజు చేస్తారా అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
Will Dil Raju Dare to Produce Another Big Pan-India Film?:
Will Dil Raju Take the Risk Again After Game Changer Setback?