టెట్ షెడ్యూల్…
సెప్టెంబర్ 15న టెట్ పేపర్1, పేపర్2 పరీక్షలను నిర్వహించనున్నారు. ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. తుది ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేస్తారు. సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షనను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తున్నారు. పరీక్ష ఫీజు రూ. 400 చెల్లించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.