Shankar Naik Vs Ravinder Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ వర్గపోరు మళ్లీ మొదలైంది. ఈసారి మహబూబాబాద్ జిల్లా వేదికైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు వర్గం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. నెల్లికుదురు మండలం మదనతుర్తిలో మామిడి తోటలో ఈ సమావేశం జరగగా… దీనిని అడ్డుకోవడానికి శంకర్ నాయక్ వర్గం ప్రయత్నించింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు వర్గీయులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశం అయింది. బీఆర్ఎస్ నేతలను, ప్రతినిధులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈసారి శంకర్ నాయక్ కు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ ఓటమి తప్పదని వారంతా హెచ్చరిస్తున్నారు.