మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్-ఏడాదికి రెండు చీరలు,ప్రతి జిల్లాలో మహిళా సంఘాల పెట్రోల్ బంకులు-cm revanth reddy good news for women two quality sarees per year petrol pumps in every district ,తెలంగాణ న్యూస్

మహిళలకు ఏడాది రెండు చీరలు

రాష్ట్రంలో ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా సమాఖ్యలను పటిష్ఠం చేయాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని విమర్శలు చేశారు. మహిళా సంఘాలు మరింత ఆర్థికంగా ఎదగాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని ఏడాదికి రెండు మంచి చీరలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో నాసిరకం చీరలు ఇచ్చేవారిని, ఇప్పుడు నాణ్యమైన చీరలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు.

Source link