మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసు, 18 ఏళ్ల తర్వాత ఐదుగురు నిందితులకు బెయిల్-ex minister paritala ravi murder case high court grants bail to five accused after 18 year ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Paritala Ravi Murder Case : టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసు నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఐదుగురి నిందితులకు హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ3 నారాయణరెడ్డి, ఏ4 రేఖమయ్య, ఏ5 రంగనాయకులు, ఏ6 వడ్డే కొండ, ఏ8 ఓబిరెడ్డికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 2005 జనవరి 24న అనంతపురం జిల్లా పెనుకొండలో పరిటాల రవి హత్యకు గురైన విషయం తెలిసిందే.

Source link