మాది రాజకీయ పార్టీ…ఎన్నికల స్టంట్ ఉంటుంది
ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు అవుతామని కలలో కూడా ఊహించ ఉండరని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు మన బిడ్డలే, మన కార్మికులే అని చెప్పిన కేసీఆర్… వారికి డబుల్ కా మీటా, డబుల్ ధమాకా ఇచ్చారన్నారు. కార్మికులు ఎప్పటికీ ఆర్టీసీలోనే ఉంటామని అనుకున్నారని, ఇవ్వాల అందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వంలో కలుపుకుంటున్నామన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ… మాది రాజకీయ పార్టీ, ఎన్నికల స్టంట్ ఎలాగైనా ఉంటుంది. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగిందా లేదా? వాళ్ల భవిష్యత్తు మంచిగా అయిందా లేదా? ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయా లేదా? అన్నారు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే ఎంత దిల్, ధైర్యం కావాలి. ఎన్ని నిధులు కావాలి. అది కేసీఆర్ కు మాత్రమే సాధ్యం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.