రాష్ట్రంలో ఎన్ని రకాల మామిడి పంట?
రాష్ట్రంలో ప్రధానంగా బంగినపల్లి, రసాలు, కొత్తపల్లి కొబ్బరి, సువర్ణరేఖ, తోతపూడి (కలెక్టర్), పండూరి మామిడి, ముంతమామిడి తదితర రకాల మామిడి పంట రైతులు పండిస్తున్నారు. కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి పండ్లుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తోతపూడి రకం మామిడ పండ్లను జ్యూస్ తయారు చేసే కార్పొరేట్ కంపెనీలు సేకరిస్తుంటాయి. మామిడి తాండ్ర తయారీలోనూ కూడా అధికంగా వినియోగిస్తారు. ఇప్పటికే రైతులు చీడల నివారణకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. కొంత మంది చిన్న, సన్నకారు మామిడి రైతులు గిట్టుబాటు రాక తోటలను ఎకరా రూ.12 వేల నుంచి రూ.15 వేలకు కౌలుకు ఇచ్చేస్తున్నారు. పూత కోత, చీడల నివారణకు ఉద్యానవన అధికారులను సంప్రదించి, వారు చెప్పిన పురుగు మందులను వాడాల్సి ఉంటుంది. అప్పుడే పూత కోత నివారణను, చీడల నివారణను అరికట్టగలుగుతారు.