మీడియాకి షో కూడా లేదా టిల్లు

సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా కానివ్వండి, పెద్ద సినిమా కానివ్వండి.. ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలకి మీడియా వాళ్లకి ప్రెస్ షో వెయ్యడమనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అలా మీడియా మిత్రులు సినిమాని వీక్షించి వెబ్ సైట్స్ ద్వారా తమ రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఈ మీడియా షో అనేది కొన్నాళ్లుగా అతి అవుతుంది. అంటే సినిమా చూస్తూనే సినిమా మధ్య మధ్యలో సినిమా అలా ఉంది, ఇలా ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అలా టాక్ స్ప్రెడ్ చేస్తే, బాగున్న సినిమాకి టికెట్స్ తెగుతాయి, కానీ సినిమా తేడా కొడితే నిర్మాత నష్టపోతాడు. 

ఇక భారీ బడ్జెట్ సినిమాలకి కూడా ప్రెస్ షో అనేది కంపల్సరీ గా వేస్తున్నారు. శుక్రవారం ఎక్కువ సినిమాలు లైన్ లో ఉంటే.. గురువారం నుంచే మీడియా కి ప్రీమియర్స్ వేస్తున్న రోజుల్లో ఇప్పుడొక టాలీవుడ్ నిర్మాత మీడియా కి ప్రెస్ షో వెయ్యకుండా ఆపడమనేది హాట్ టాపిక్ అయ్యింది. ఆయనే టిల్లు స్క్వేర్ నిర్మాత నాగ వంశి. గుంటూరు కారం విషయంలో మీడియా వలన ఆయన ఇబ్బంది పడడం వల్లే ఈసారి మీడియాని నాగ వంశి పట్టించుకోలేదు అంటున్నారు. 

గుంటూరుకారం విషయంలో మీడియా నాగ వంశీని ఓ ఆటాడుకుంది. అప్పటినుంచి మీడియా మీద కక్కలేక మింగలేక ఉన్న నాగవంశీ ఈసారి టిల్లు విషయంలో మీడియాని లైట్ తీసుకున్నట్లుగా, మీడియా కు షో వేసి మరీ వారితో తిట్టించుకోవాలా..? వారి రివ్యూ మాకక్కర్లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. శుక్రవారం గుడ్ ఫ్రైడే, మార్చ్ 29న థియేటర్స్ లో విడుదల కాబోయే సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ప్రెస్ షో ఎక్కడ పెడతారో, AAA, లేదంటే Imax, కాదు అంటే AMB లోనా అని ఆత్రంగా ఎదురు చూసిన మీడియాకి నాగ వంశి ఝలక్ ఇచ్చాడు. అంటే మీడియా నాగవంశీకి అక్కర్లేదా.. ఒకవేళ టిల్లు హిట్ అయితే.. అప్పుడు మీడియా ద్వారానే కదా పబ్లిసిటీ చెయ్యాల్సింది. 

సినిమా విడుదలకు ముందు మీడియా మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వూస్ ఇచ్చి సినిమాని పబ్లిసిటీ చేసుకోవడానికి మీడియా కావాలి కానీ.. వాళ్ళకి షో వెయ్యడానికి మాత్రం నాగ వంశీకి ఇంట్రెస్ట్ లేకుండా పోయిందా అనే మాట ఇప్పుడు టాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో నడుస్తుంది. 

Source link