మరోవైపు ఈ స్కీమ్ కు సంబంధించి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ… కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బీసీలకు లక్ష ఆర్థికసాయం పథకం నిరంతర ప్రక్రియని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పథకానికి అర్హులను ఎంపిక చేసి ప్రతినెలా 15న ఆర్థికసాయం అందిస్తారని వెల్లడించారు. మొదటగా అర్హతకలిగిన లబ్ధిదారుల్లోని అత్యంత పేదలకు అందజేస్తారని వెల్లడించారు. అయితే ప్రతి నెల 5వ తేదీలోపు కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. ఇన్‌చార్జి మంత్రులు ధ్రువీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతి నెలా 15లోగా స్థానిక ఎమ్మెల్యేలు రూ.లక్ష ఆర్థికసాయం అందజేస్తారని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారంను ఏ ఆఫీసులోనూ, ఏ అధికారికి అందజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. లబ్ధిదారులు నెలరోజుల్లోగా తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామగ్రిని కొనుకోవాలని…. ఆ నిర్ణయాధికారం పూర్తిగా లబ్ధిదారులదేనని వివరించారు. కొనుగోలు చేసిన యూనిట్ల ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు.