Medchal Seat Fight : తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలతో… సీట్ల కోసం పోటీ పెరిగింది. కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. తమకే సీటు అంటూ స్థానిక నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ లో ఎవరికి సీటు అనేది డిసైడ్ చేసేది హైకమాండ్ అని సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ జెండా భుజాన మోసిన వారికే ప్రాధన్యత ఇస్తారంటున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారంతా తమకు సీట్లు ఖాయమంటూ చేసుకుంటున్న ప్రచారంతో వారి డొల్లతనం బయట పడుతోందంటున్నారు. తాజాగా తీన్మార్ మల్లన్న తనకు మేడ్చల్ సీటు ఖాయమని ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే పార్టీ అధిష్ఠానం ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. మేడ్చల్ లో కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నా నష్టాలు భరించి పనిచేసిన నేతలు ఉన్నారని, వారి వైపే కాంగ్రెస్ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోందని సీనియర్ నేతలు అంటున్నారు.