నందమూరి బాలాకృష్ణ-బాబీ కొల్లి కాంబోలో నిన్న జనవరి 12 న విడుదలైన డాకు మహారాజ్ చిత్రానికి మల్టిప్లెక్స్ ఆడియన్స్ నుంచి యావరేజ్ టాక్ వచ్చినా బీసీ సెంటర్స్ నుంచి మాత్రం అదిరిపోయే హిట్ టాక్ రావడంతో నందమూరి అభిమానులు రిలాక్స్ అవుతున్నారు. నిన్న ఆదివారం ఉదయం హైదరాబాద్ లో డాకు మహారాజ్ ఖాళీ థియేటర్స్ చూసి టెన్షన్ పడిన అభిమానులకు రూరల్ నుంచి అందిన రిపోర్ట్స్ ఊరటనిచ్చాయి.
మరోపక్క నందమూరి అభిమానుల రచ్చతో డాకు మహారాజ్ గా బాలయ్య మొదటిరోజు అదిరిపోయే ఓపెనింగ్స్ తీసుకొచ్చారు. ముందు నుంచి బజ్ లేదు అన్నప్పటికి రెండో ట్రైలర్ వచ్చాక సీన్ మారిపోయింది.. గేమ్ చెంజర్ ఎఫెక్ట్ కూడా డాకు మహారాజ్ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు డాకు మహారాజ్ 56 కోట్ల షేర్ కలెక్ట్ చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ వదిలారు.
ఆ పోస్టర్ చూసిన నందమూరి ఫ్యాన్స్ మొదటిరోజు బాక్సాఫీసును వీరంగం ఆడించిన డాకు మహారాజ్ అంటూ కామెంట్ చేస్తున్నారు,