మోక్షజ్ఞ-నాగ్ అశ్విన్ కాంబో ఒట్టి రూమరే

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రశాంత్ వర్మ తో చెయ్యడం లేదు, ఆ మూవీ ఆగిపోయింది అనే వార్తలు డిసెంబర్ 7 నుంచి నిన్నటివరకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కానీ మేకర్స్ సడన్ గా నిన్న ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞ మూవీ ఆగిపోలేదు, ఆ కాంబో పై వచ్చే రూమర్స్ నమ్మవద్దు, త్వరలోనే ఈ చిత్రం ప్రారంభమవుతుంది అంటూ ప్రెస్ నోట్ వదిలారు. 

ఈ రూమర్స్ ప్రచారంలో ఉన్న సమయంలోనే మోక్షజ్ఞ కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ తో మరో మూవీ చెయ్యబోతున్నాడనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దానితో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే మోక్షుజ్ఞ డెబ్యూ మూవీ ఆగిపోలేదు అంటూ ప్రెస్ నోట్ వచ్చిన కొద్దిసేపటికే కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ తో మోక్షజ్ఞ కాంబో అంతా ట్రాష్ అనే వార్త వైరల్ అయ్యింది. 

నాగ్ అశ్విన్-మోక్షజ్ఞ మూవీ లేదు, అదంతా ఒట్టి ప్రచారమే అనగానే నందమూరి అభిమానులు బాగా హార్ట్ అయ్యారు. అయితే నాగ్ అశ్విన్ టీం మోక్షజ్ఞ తో నాగ్ అశ్విన్ మూవీపై జరుగుతున్న ప్రచారానికి కావాలనే చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. సో నాగ్ అశ్విన్ తో మోక్షు మూవీ లేనట్లే. 

Source link