యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ పాల్గొనని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన ఫోటోలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ నెలలోనే షూటింగ్‌లో జాయిన్ కానున్నారు.
మొదట ఎన్టీఆర్ ఏప్రిల్ తర్వాత ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యే అవకాశం ఉండగా వార్ 2 షూటింగ్ బ్రేక్ కావడంతో ముందుగానే డ్రాగన్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ గాయపడటంతో వార్ 2 షూటింగ్ నెలరోజులు వాయిదా పడింది. దీనిని అవకాశంగా మార్చుకుని ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలో ప్రారంభమయ్యే షెడ్యూల్‌లో ఎన్టీఆర్ భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ మాస్ సాంగ్‌లోనూ పాల్గొననున్నాడు.
2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేసినప్పటికీ.. ప్రశాంత్ నీల్ గత సినిమాల అనుభవాన్ని చూస్తే ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందేమో అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే షూటింగ్ అనుకున్న గడువులో పూర్తయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిజమైన పండగే అవుతుందని చెప్పొచ్చు.