వలిగొండ మండలం లోతుకుంట గ్రామంలోని మోడల్ స్కూల్‌లో గోగు అఖిల, కోరబోయిన అక్షితలు అనే ఇద్దరు విద్యార్థినులు 8వ తరగతి చదువుతున్నారు. గత వారం గురువారం ఉదయం జావ తాగుతుండగా…..ఎంతసేపు తాగుతారని ప్రిన్సిపల్ రహి సున్నిసా బేగం విద్యార్థినుల తిడుతూ పైపుతో కొట్టారు. క్లాసులు ముగిశాక విద్యార్థినులు ఇంటికి వెళ్లిపోయారు. చేతులు నొప్పిగా ఉన్నా… ప్రిన్సిపల్ మళ్లీ కొడతారేమోనన్న భయంతో జరిగిన విషయం ఇంట్లో చెప్పలేదు విద్యార్థినులు. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులను పరిశీలించిన ప్రిన్సిపల్…చేతులు వాపును చూసి వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. విద్యార్థినులను పరిశీలించిన వైద్యుడు…ఒకరికి బొటన వేలు, మరొకరికి మణికట్టు కీలు విరిగిందని చెప్పి కట్టుకట్టి పంపించారు. చేతికి కట్టుతో ఇంటికి వెళ్లిన విద్యార్థినులు జరిగిన విషయం తల్లిదండ్రులు చెప్పారు.