యువగళం చాప్టర్‌-2… మిగిలే ఉంది!-yuvagalam 200 days the rise of the young leader nara lokesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

యువగళంలో హామీల వర్షం

పాదయాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటానన్న లోకేశ్‌, ఆయ వర్గాలన్నింటికీ ప్రత్యేక హామీలు ఇచ్చారు. యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రాష్ట్రానికి పెద్ద ప్రైవేట్‌ కంపెనీలు తీసుకొస్తామని, స్వయం ఉపాధి కోసం శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళలకు ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, ‘అభయ హస్తం’ పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌ సబ్సిడీ, టమోటో రైతులకు గిట్టుబాటు ధర, మామిడి బోర్డు ఏర్పాటు, పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, స్థానికంగా మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వంలో అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామన్నారు. ముస్లింల కోసం ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసి, మైనారిటీ బాలికల కోసం ప్రత్యేక కళాశాలలు కట్టిస్తామన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే లోకేశ్‌ ఇచ్చిన అనేక వినూత్న హామీలు ఈ జాబితాలో ఉన్నాయి. చేనేత, గౌడ, కురుబ, రజకులు, వడ్డెరలు, యాదవులు, బుడగ జంగాలు, షట్ర, ఉప్పర, వక్కలిగలు, వాల్మీకి, మత్స్యకారులు, బ్రాహ్మణులు, వ్యాపారులు… ఇలా ప్రతి వర్గానికి లోకేశ్‌ ప్రత్యేక హామీలు ఇచ్చారు. ఇవన్నీ ఆయా వర్గాలను ఆకట్టుకునే హామీలే అయినప్పటికీ… క్షేత్రస్థాయిలో వీటిని తగిన రీతిలో ప్రచారం చేయడంలో టీడీపీ క్యాడర్‌ విఫలమైంది.

Source link