ByGanesh
Thu 30th Jan 2025 07:18 PM
కన్నడ నటి రష్మిక మందన్న క్రేజ్ మాములుగా లేదు, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అవడంతో పాన్ ఇండియా మార్కెట్లో రష్మిక రేంజ్ బాగా పెరిగిపోయింది. ఇప్పటికే సౌత్ ఆఫర్స్ వద్దనుకుని నార్త్ హీరోల అవకాశాలను చేజిచ్చిక్కించుకుంటున్న రష్మిక మందన్న తాజాగా మరో బాలీవుడ్ ఆఫర్ ని అందుకుంది అంటున్నారు.
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ తో జత కడుతుంది. ఇప్పుడు మరో తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో మొదలు కాబోయే పాన్ ఇండియా మూవీకి సల్మాన్ ఖాన్ – రజినీకాంత్ లను హీరోలుగా అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని బడా మల్టీస్టారర్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈచిత్రం కోసమే అట్లీ రష్మిక ను సంప్రదిస్తున్నాడని అంటున్నారు.
ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ షూటింగ్ మొదలు కాబోతుంది అని తెలుస్తోంది. ఈలోపు రష్మిక డేట్స్ కూడా సెట్ అవుతాయని, ఈ ప్రోజెక్టు లో మోస్ట్లీ రష్మికనే హీరోయిన్ గా ఫైనల్ అంటున్నారు.
Rashmika Mandanna Bags Another Bollywood Project with Salman Khan and Rajinikanth:
Rashmika Mandanna Next Big Bollywood Film with Atlee and Mega Stars