రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె..ఎంట్రీ ఆ పార్టీ నుంచేనా?-vangaveeti rangas daughter may contest in the assembly elections from vijayawada

2018లో వంగవీటి రాధా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో వైసీపీ నేతలు సర్దిచెప్పే ప్రయత్నాలు చేసినా ఆయన ఎవరి మాట వినకుండా టీడీపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2009, 2019 ఎన్నికల్లో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నా దుందుడుకుతనంతో రాజకీయ జీవితాన్ని కోల్పోయారు. దాదాపు నాలుగేళ్లుగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ ఎప్పుడు యాక్టివ్ అవుతారనేది ఎవరికి తెలీదు. రంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో మాత్రమే రాధా పబ్లిక్‌లో కనిపిస్తున్నారు. టీడీపీ కార్యక్రమాల్లో కూడా ఆయన కనిపించరు.

Source link