రాజమౌళి తర్వాత సందీప్ రెడ్డి కండిషన్స్ అప్లై

రాజమౌళి తో వర్క్ చేసే హీరోలెవరైనా ఒక్కసారి సెట్స్ లోకి అడుగుపెట్టాక రాజమౌళి చెప్పింది చెయ్యాల్సిందే. అది ప్రభాస్ అయినా, లేదంటే ఎన్టీఆర్ అయినా, మహేష్ అయినా, రామ్ చరణ్ అయినా ఎవ్వరైనా రాజమౌళి షరతులు వర్తించాల్సిందే. జ్వరమొచ్చినా, లేదంటే బద్దకంగా ఉన్నా, కాదు వేరే ప్రోగ్రాం ఉన్నా అన్ని మానుకుని రాజమౌళితో షూటింగ్ చేయాల్సిందే.

ఇప్పుడు రాజమౌళి మాదిరే మరో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా హీరోలకు ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు కండిషన్స్ పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రభాస్ బాహుబలి తర్వాత మూడున్నప్పుడు షూటింగ్ చేస్తూ సినిమాలు పూర్తి చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలు ఏవి అనుకున్న టైమ్ కి విడుదల కావడం లేదు. ఇప్పుడు రాజా సాబ్ కూడా ఏప్రిల్ రావాల్సింది, అది దసరా కు పోస్ట్ పోన్ అయ్యింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ పూర్తిగా ఫ్రీ అయ్యేవరకు స్పిరిట్ మొదలు పెట్టడం లేదట. ప్రభాస్ తన సెట్ లోకి వచ్ఛాక త‌న సినిమా పూర్త‌య్యే వ‌ర‌కూ మ‌రో సినిమా చేయ‌కూడ‌ద‌న్న‌ది ఫస్ట్ కండీషనట. కాల్షీట్లు బంచ్‌గా ఇవ్వాలి. వారానికి ఒక‌రోజో, రెండు రోజులో ఇస్తే కుద‌ర‌దు. స్పిరిట్ లుక్ చాలా డిఫ్రెంట్ గా వేరుగా ఉంటుంది. ఆ లుక్‌తో బ‌య‌ట ఎక్కువ‌గా క‌నిపించ‌కూడ‌ద‌న్న‌ది సందీప్ మెయిన్ కండిషన్ అంటున్నారు.

మరి ఈ రేంజ్ లో ప్రభాస్ కండిషన్స్ కి ఒప్పుకునే స్పిరిట్ సెట్స్ లోకి వెళ్ళబోతున్నారనే న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. 

Source link