రాబిన్‌హుడ్ ఓవర్సీస్ టాక్

భీష్మ కాంబో రిపీట్ అనగానే అందరి చూపు దానిపైనే. నితిన్-వెంకీ కుడుముల అలాగే భీష్మ హీరోయిన్ రష్మిక కలిసి ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నారు అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుంది, అంతలోనే రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం, ఆమె ప్లేస్ లోకి శ్రీలీల రావడం అన్ని చక చకా జరిగిపోయాయి. నితిన్-వెంకీ కుడుముల కాంబో రాబిన్‌హుడ్ అంటూ మార్చ్ 28 ఉగాదిని టార్గెట్ చెయ్యడమే కాదు ప్రమోషన్స్ పరంగా కొత్త ట్రెండ్ ని సెట్ చేసారు. 

మంచి అంచనాల నడుమ ఈ రోజు విడుదలైన రాబిన్‌హుడ్ ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తి కావడంతో ప్రేక్షకులు సోషల్ మీడియాలో రాబిన్‌హుడ్ ముచ్చట్లు మొదలు పెట్టారు. రాబిన్‌హుడ్ ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. రాబిన్‌హుడ్ ఫస్టాఫ్ పర్వాలేదు కానీ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. 

సినిమా యావరేజ్ కంటే కాస్త పర్వాలేదు, ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ జస్ట్ ఓకె. కామెడీ వర్కౌట్ అయిందని మరో నెటిజెన్ స్పందించాడు. రాబిన్‌హుడ్ సమ్మర్‌లో మంచి ఎంటర్‌టైనర్. నితిన్, రాజేంద్రప్రసాద్ కాంబో ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్.. అంటూ మరో ఆడియెన్ ట్వీట్ చేసాడు. 

వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ బాగుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు ప్లస్ అంటూ మరో ప్రేక్షకుడు స్పందన ఉంది. జీవీ ప్రకాష్‌ కుమార్ మ్యూజిక్ ఏమాత్రం ఇంప్రెస్స్ చెయ్యలేదు, డేవిడ్ వార్నర్ కోసం క్లైమాక్స్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే. వెంకీ కుడుముల రైటింగ్  విమర్శలు, కొత్తదనం లేని మేకింగ్ అంటూ రాబిన్‌హుడ్ పై పలువురు ఆడియన్స్ ఇచ్చిన రియాక్షన్స్ ఇవి. 

Source link