Manoj Tiwary: రిటైర్మెంట్ ప్రకటించి వారం కూడా కాలేదు. అప్పుడే మనసు మార్చుకున్నాడు బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ. తాను మళ్లీ క్రికెట్ ఆడతానని, బెంగాల్ కు రంజీ ట్రోఫీ అందించడానికి ఇంకొక్క ప్రయత్నం చేస్తానని అతడు చెప్పడం విశేషం. ఇప్పటికే రెండుసార్లు రంజీ ట్రోఫీ గెలిచిన బెంగాల్.. చివరి మూడు సీజన్లలో రెండుసార్లు ఫైనల్ చేరినా కప్పు గెలవలేకపోయింది.