Rishabh Pant – BCCI: గతేడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు డిసెంబర్ నుంచి క్రికెట్‍కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఉన్నాడు. వెన్ను సర్జరీ చేయించుకున్న తర్వాత భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా కూడా ఎన్‍సీఏలో ఉన్నాడు. మరోవైపు, టీమిండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా వేర్వేరు సందర్భాల్లో గాయపడ్డారు. దీంతో, ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‍కు టీమిండియాకు ఇబ్బందిగా మారింది. కాగా, ఈ ఐదుగురు ఆటగాళ్ల మెడికల్, ఫిట్‍నెస్‍పై బీసీసీఐ నేడు (జూలై 21) అప్‍డేట్ వెల్లడించింది.