Crop Loan Waiver Scheme in Telangana: రుణమాఫీ విషయంలో రైతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. వెంటనే రుణాలను మాఫీ చేయాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో… గురువారం నుంచి ప్రక్రియ మొదలైంది. రుణమాఫీలో భాగంగా ఇవాళ రూ. 37 వేల నుండి రూ. 41 వేల మధ్యన ఉన్న రుణాలు మాఫీ అయ్యాయి. ఈ మేరకు రూ.167.59 కోట్లు విడుదల అయ్యాయి. ఫలితంగా 44,870 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.