రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను అసెంబ్లీలో పయ్యావుల ప్రవేశపెట్టారు. 2024లో రాష్ట్ర ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని అని.. సవాళ్లను అధిగమించడంలో చంద్రబాబు దిట్ట అని కేశవ్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలన అంతా నిర్లక్ష్యం.. విధ్వంసం జరిగిదని ఆరోపించారు.