సమంత తన ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని మళ్ళీ నటనవైపు అడుగులు వేసేందుకు సిద్ధమైంది. గత ఆరు నెలలుగా ఏ సినిమా సెట్స్ లో కనిపించలేదు. నటనకి బిగ్ బ్రేకిచ్చిన సమంత ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకుంది. అటు హెల్త్ ట్రీట్మెంట్ ఇటు సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో నిత్యం బిజీగా కనబడిన సమంత ఇకపై బ్రేక్ కి గుడ్ బై చెప్పి నటనను కొనసాగించబోతున్నట్లుగా చెప్పింది. అటు నిర్మాణ సంస్థని మొదలు పెట్టిన సమంతపై ఇక సినిమాలు చెయ్యడానికి రెడీ అయ్యింది.
అందుకే వరసగా గ్లామర్ ఫోటో షూట్స్ ని నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అది చూసిన నెటిజెన్స్ కూడా సమంత నటనకి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. దర్శకనిర్మాతలు మీరే రెడీ అవ్వాలి. సమంతని దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోవాలి. స్టార్ హీరోల్లో అవకాశాలు ఏమో కానీ.. ఆమెకి హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చేసేందుకు దర్శకులు రెడీ అవుతారని అందరూ భావిస్తున్నారు. గతంలో ఓ బేబీ, యు టర్న్, శాకుంతలం, యశోద లాంటి చిత్రాల్లో సమంత నటించింది.
మరి సమంత ఇకపై గ్లామర్ పాత్రలకి నో చెబుతుంది అనుకుంటే.. అబ్బే అలాంటిదేం లేదు.. ఇంకా గ్లామర్ చూపించడానికి రెడీ అన్నట్టుగా ఆమె సోషల్ మీడియా ట్రీట్ కనబడుతుంది. అంటే ఆమె ఇంకా గ్లామర్ కేరెక్టర్స్ నే ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది దానర్ధం. మరి సమంత నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుందో, అది ఎవరితో చేస్తుందో చూడాలి.