రేపటితో ముగియనున్న ఫీజు రీయింబర్స్మెంట్ టోకెన్ గడువు, బకాయిలు చెల్లించాలని బండి సంజయ్ లేఖ-karimnagar bjp mp bandi sanjay letter on fee reimbursement to private colleges release by tomorrow ,తెలంగాణ న్యూస్

రూ.7800 కోట్ల బకాయిలు

బీఆర్ఎస్ పాలనలో(BRS Rule) ఎన్నడూ ఫీజురీయంబర్స్ మెంట్ సక్రమంగా చెల్లించకపోవడంతో అటు కాలేజీ యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. గత మూడేళ్లుగా ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.7800 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా అధ్యాపకులు, సిబ్బంది జీతభత్యాలు, కళాశాల భవనాల అద్దె, మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించలేక గత మూడేళ్లలో వందలాది కాలేజీలు మూతపడ్డాయి. గత ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల్లో దాదాపు రూ.750 కోట్లు డిగ్రీ, పీజీ కళాశాలలకు మార్చి నెలాఖరు నాటికి చెల్లిస్తామని పేర్కొంటూ టోకెన్లు(Tokens) జారీ చేసింది. కానీ నేటి వరకు నయా పైసా చెల్లించలేదు. రేపటితో(ఈనెల 31నాటికి) టోకెన్ల గడువు ముగుస్తోంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు స్పందన లేకపోవడం బాధాకరమని బండి సంజయ్(Bandi Sanjay) తన లేఖలో పేర్కొన్నారు.

Source link