JEE MAIN 2024 :రేపటి నుంచి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ సెషన్-2 (JEE MAIN-2 Exams 2024)పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ మెయిన్ పరీక్షకు వేల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. ఏప్రిల్ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లను(JEE MAIN-2 Admit Cards) అందుబాటులో ఉంచింది. అభ్యర్థులను పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. జేఈఈ మెయిన్ ను ఇంగ్లిషుతో పాటు ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. తెలుగు, ఉర్దూలో కూడా పరీక్ష రాయవచ్చు. ఈ పరీక్షల నేపథ్యంలో ఎన్టీఏ కీలక సూచనలు చేసింది.