రేపు పదోతరగతి సోషల్ పరీక్ష యథాతథం, ఎలాంటి అపోహలు వద్దు- పాఠశాల విద్యాశాఖ-ap ssc social studies exam 2025 no postponement education dept confirms ,career న్యూస్

AP SSC Exams : ఏపీ పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 1) సోషల్ స్టడీస్ పరీక్ష యథావిధిగా నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందన్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు సంబంధించిన అందరూ అధికారులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ విషయాన్ని ఆర్జేడీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సంబంధిత అధికారులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తెలపాలని కోరారు.

Source link