రేవంత్ రెడ్డి నిర్ణయంలో తప్పేముంది

రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీపై పగ పట్టారు అనడం కన్నా ఇప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీ విషయంలో తీసుకున్న నిర్ణయంలో తప్పేముంది అంటూ మేధావులు మాట్లాడుతున్నారు. కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీసి రెండు వారాల్లో కలెక్షన్స్ తెచ్చుకునేందుకు సామాన్యుడిపై టికెట్ భారాన్ని మోపుతున్న నిర్మాతలు, అభిమానుల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారి బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు. 

హీరోల కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న అభిమానులను హీరోలు పదో పరకో ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు, అందుకే ఇకపై టికెట్ రేట్లు పెంచడం కానీ, బెన్ఫిట్ షోస్ కి అనుమతులు ఇవ్వడం కానీ చెయ్యమని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయానికి సినీప్రముఖులు కలత చెబుతుంటే మేథావులు అందులో ఎలాంటి తప్పు లేదు అని సమర్ధించడం హాట్ టాపిక్ అయ్యింది. 

బుద్దుండే ప్రతి ఒక్కడు రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తాడు, అంత మంది వెళ్లి పరామర్శించాల్సిన అవసరం ఏముంది ? ఓ పక్క చిన్న పిల్లాడు చావు బ్రతుకుల్లో కొట్టు మిట్టాడుతున్నాడు మీకు పరామర్శలు కావాలా ? అంటూ అల్లు అర్జున్ జైలు నుంచి రాగానే పరామర్శించడానికి వెళ్లిన సినీ సెలెబ్రెటీస్ పై నెటిజెన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు.

రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కి ఏమైనా కాలు విరిగిందా, చెయ్యి విరిగిందా, ఆయనకేమైంది అని అంతా వెళ్లి పరామర్శించి వచ్చారు అంటూ మాట్లాడిన మాటలు అల్లు అభిమానులకు కోపం తెప్పించాయేమో కానీ.. చాలామందికి రేవంత్ మాటలు నిజాలుగా తోస్తున్నాయి. మరి రేవంత్ అల్లు అర్జున్ విషయంలో చేసిన కామెంట్స్ పై సినీ పెద్దలెలా స్పందిస్తారో చూడాలి. 

Source link