రేవంత్ రెడ్డి నిర్ణయం దేశానికే ఆదర్శం.. వైఎస్ షర్మిల ఇంట్రెస్టింగ్ కామెంట్స్-ys sharmila interesting comments on revanth reddy caste census decision ,తెలంగాణ న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన.. దేశానికే ఆదర్శం అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కొనియాడారు. ఇదో చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి.. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనం అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, అంటే.. దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశం అని అన్నారు.

Source link