రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, జూన్ 26 నుంచి రైతు బంధు నిధులు విడుదల-telangana cm kcr order to release rythu bandhu funds from june 26th

CM KCR : రుతుపవనాలు ఆలస్యం అవుతున్న కారణంగా…రాష్ట్ర రైతాంగానికి వానాకాలం పంట సాగునీటి సరఫరాపై ముందస్తు చర్యల తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వానకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను జూన్ 26 నుంచి విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రైతులకు ఎప్పటిలాగే నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావును, అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిన అనంతరం, పట్టాలు పొందిన రైతులకు రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారలను ఆదేశించారు.

Source link