రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టెన్త్ విద్యార్థికి 6.7 జీపీఏ-తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు-medak ssc student recently died in road accident got 6 7 gpa parents are in tears ,తెలంగాణ న్యూస్

పెదనాన్న కూతురు పెళ్లికి బట్టలు కొనటానికి వెళ్తూ

అఖిల్ పెద్దనాన్న కుమార్తె పెళ్లి ఏప్రిల్ 24న ఉండటంతో.. ఏప్రిల్ 15న రోజు పెళ్లి బట్టలు కొనాలని కుటుంబ మొత్తం దగ్గర్లో ఉన్న తూప్రాన్ పట్టణానికి బయలుదేరింది. అఖిల్ తండ్రి బాలకృష్ణ, తూప్రాన్, చందాయిపేట మధ్య సొంత ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అదే ఆటోలో, బాలకృష్ణ, తన భార్య రాధా, అఖిల్, మిగతా కుటుంబ సభ్యులు కలసి, తూప్రాన్ కు బయలుదేరారు. తూప్రాన్ పట్టణం దగ్గర్లోని నాగులపల్లి చౌరస్తా వద్దకు రాగానే, హైవే మీద అతివేగంగా వచ్చిన ఒక కారు వీరి ఆటోని బలంగా(Accident) ఢీకొట్టింది. ఆటోలో నుంచి కిందపడిపోయిన అఖిల్ తల మీద నుంచి కారు వెళ్లటంతో, అతను అక్కడికక్కడే మరణించాడు. మిగిలిన కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. అఖిల్ చనిపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు కుటుంబసభ్యులు.

Source link