లండన్ లో ఉద్యోగం వదిలేసి అవకాడో సాగు, ఎంటెక్ చదివి బొప్పాయి పంట- అద్భుతాలు సృష్టిస్తున్న యువ రైతులు-hyderabad minister niranjan reddy felicitated young farmers doing agriculture with modern techniques

యువతను వ్యవసాయం వైపు మళ్లించాలి

కల్వకుర్తికి చెందిన వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థి శివకుమార్… యూట్యూబ్ ద్వారా వ్యవసాయ విజయాలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. లక్ష మంది సబ్ స్క్రైబర్లతో విజయవంతంగా రైతుల విజయాలను ప్రచారం చేస్తున్నారు. ఈ ముగ్గురు యువ రైతులు మంత్రి నిరంజన్ రెడ్డిని కలిశారు. వీరిని మంత్రి అభినందించారు. మీలాంటి యువతే రేపటి తరానికి ఆదర్శం అన్నారు. వ్యవసాయమే ఈ ప్రపంచ దిక్సూచి అన్న మంత్రి.. వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటేనే ఈ ప్రపంచం సురక్షితంగా ఉంటుందన్నారు. సాగుకు దూరమవుతున్న యువత మీలాంటి వారిని చూసి మళ్లీ వ్యవసాయాన్ని ప్రేమించాలని, మట్టి పరిమళాన్ని ఆస్వాదించాలన్నారు. సాగు మీద దృష్టి పెట్టి పంటల ఉత్పత్తిలో అద్భుతాలు సృష్టించాలని కోరారు. సమాజ ఆలోచనా విధానాన్ని సంపూర్ణంగా మార్చాలన్నారు. దానికి మీరు పునాదిరాళ్లు .. మీ నేతృత్వంలో మరింతమందిని ఇటు వైపు మళ్లించాలని యువ రైతులను మంత్రి కోరారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో తనను కలిసిన యువరైతులు అదీప్ అహ్మద్, జైపాల్ నాయక్ , యూ ట్యూబర్ శివకుమార్ లను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్, రంగారెడ్డి జిల్లా ఉద్యాన అధికారి సునంద పాల్గొన్నారు.

Source link