లైంగిక వేధింపుల ఆరోపణలు-యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్టు-hyderabad police arrested youtuber prasad behara on molestation allegations ,తెలంగాణ న్యూస్

కమిటీ కుర్రాళ్లు సినిమాలో పెద్దోడు పాత్రతో ఆకట్టుకున్న ప్రసాద్ బెహరా…ప్రస్తుతం అల్లరి నరేష్ బచ్చల మల్లి సినిమాలో నటించారు. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన ప్రసాద్ బెహరా.. కామెడీ సిరీస్ లు చేస్తూ యూట్యూబ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న ప్రసాద్ బెహరాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. షూటింగ్ సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడం, తాకడం వంటివి చేసేవాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Source link