ఆశావహుల ముందు 17 డిక్లరేషన్లను పెట్టిన పార్టీ
అప్లికేషన్ ఫామ్ లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల ముందు పార్టీ 17 డిక్లరేషన్ లను పెట్టింది. “పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించని పక్షంలో పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేయనని డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. అలాగే నేను కట్నం తీసుకోను, ఇవ్వను అని, హింసకు తావివ్వకుండా, స్త్రీల గౌరవాన్ని నిలబెడతానని పార్టీ ప్రోటోకాల్ పాటించడంతో పాటు మత, కుల రాజకీయ సంస్థలతో అనుబంధం కలిగి ఉండనని, కులమత భావాలను ప్రోత్సహించే ఇలాంటి సమావేశాలకు హాజరుకానని డిక్లరేషన్ ఇవ్వాలని అభ్యర్థులను కోరింది. ఏ క్రిమినల్ ఎలిమెంట్ తోనూ ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండనని, ఎన్నికల తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో ఆస్తి రిటర్న్ లు, ప్రతి సంవత్సరం ఆస్తులు వివరాలను సమర్పిస్తానని తదితర అంశాలపై డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. అలాగే ఏఐసీసీ, వర్కింగ్ కమిటీ లేదా సెంట్రల్ పార్లమెంట్ బోర్డు ద్వారా నిర్దేశించిన ఆదేశాలను అనుసరించడంతో పాటు పార్టీ జారీ చేసే విప్ లను పాటిస్తానని సంతకంతో ప్రతిజ్ఞ చేస్తున్నట్లు సంతకం చేసి అప్లికేషన్ ఇవ్వాలని ఆశావహులను కోరింది.