వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్

సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కానీ, ఆయనపై ఫ్యాన్స్ లో ఉన్న అభిమానం కానివ్వండి అన్ని ప్రత్యేకమే. ఆయన చేసింది తక్కువ సినిమాలే. కానీ అభిమానులు మాత్రం కోకోల్లలు, సినిమాలకు గ్యాప్ ఇచ్చినా పవన్ పై ప్రేమ, అభిమానము తగ్గడం లేదు. ఇక రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సింగిల్ గా అడుగుపెట్టి ఈరోజు మహానాయకుడిగా ఎదిగారు. 

జనసేన పార్టీని స్తాపించినప్పుడు ఆయనతో నడిచింది కేవలం ఒకరిద్దరు మాత్రమే. 2014 నుంచి పోరాటం చేస్తే 2024 కు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఫలితం కనిపించింది. అలుపెరగని పోరాట యోధుడిగా పొలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ జీవితాన్ని చెప్పుకుంటారు. 2014 లో పొత్తుతో టీడీపీ ని అధికారంలోకి తెచ్చిన పవన్ కళ్యాణ్ ఆతర్వాత అంటే 2019 నాటికీ పొత్తు నుంచి బయటికొచ్చి పోటీ చేసి పరాభవం పాలయ్యారు. కేవలం ఒక సీటుతో జనసేన సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అలా అని రాజకీయాలకు దూరమవ్వలేదు, అధికార పక్షం అన్న మాటలు పడ్డారు, మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. ఓడిన చోటే గెలిచారు, ఏపీ ప్రభుత్వాల్లో కీలకం అయ్యారు. జనసేన పార్టీ నుంచి నిలబెట్టిన ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకున్నారు. డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రధాని మోదికి అత్యంత ఆప్తుడయ్యారు. ఓడిపోయాను కదా అని రాజకీయ సన్యాసం తీసుకుని సినిమాలు చేసుకొలేదు, ఓడిపోయిన రాజకీయ రంగంలోనే పోరాడుతూ ముందుకు సాగారు. గెలిచి చూపించారు.  

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో ఒక బ్రాండ్, పవన్ అంటే ఫ్యాన్స్ లో ఇంకా పెరిగిన క్రేజ్. ఈరోజు మార్చ్ 14 జనసేన ఫార్మేషన్ డే సందర్భంగా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదికగా ఇచ్చే స్పీచ్ కోసం అయన అభిమానులే కాదు, ఏపీ ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. 

Source link