ఒక్కడి పనేనా..?
బుధవారం ఉదయం చోరీ వ్యవహారం వెలుగులోకి రాగా.. స్థానికులు వెంటనే కేయూ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ రవి కుమార్, ఎస్సైలు శ్రీకాంత్, మాధవ్, రవీందర్, ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో కాలనీ చివర ఉన్న కావేరీ నిలయంలో సీసీ కెమెరాలు ఉండగా.. పోలీసులు వాటిని పరిశీలించే పనిలో పడ్డారు.