వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్-రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు-warangal crime moneylender kidnapped borrower forced to sign on 28 lakh debt promissory notes ,తెలంగాణ న్యూస్

లైట్​ తీసుకున్న పోలీసులు

మధుసూదన్​ కిడ్నాప్(Kidnap)​ విషయం తెలిసిన వెంటనే భయాందోళనకు గురైన ఆయన భార్య సుగుణ డయల్​ 100కు కాల్ చేసింది. తన భర్తను కిడ్నాప్​ చేశారని, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వేడుకుంది. కానీ పోలీసులు(Police) సరిగా స్పందించలేదు. ఆ తరువాత ఏప్రిల్ 23న పరకాల ఏసీపీని కలిస్తే కిడ్నాప్ విషయం పక్కన పెట్టి, సమ్మయ్య తీసుకున్న రూ.10 లక్షలు ఎప్పుడిస్తారని తమను ప్రశ్నించినట్లు బాధితులు వాపోయారు. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయి వరంగల్ సీపీ(Warangal CP) అంబర్​ కిశోర్​ ఝాను కలిశారు బాధితులు. విషయం సీపీ ఆఫీస్​ దాకా వెళ్లడంతో పరకాల పోలీసులు(Parkal Police) మధుసూదన్​ను కిడ్నాప్ చేసిన వారిపై ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఏప్రిల్​28న ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసి, 30వ తేదీన కానుగంటి కరుణాకర్, మేకల దిలీప్​, బొచ్చు రమేశ్​, చెనుమల్ల సమ్మయ్య, చెనుమల్ల అనిల్​ను అరెస్ట్​ చేశారు. వారి నుంచి రూ.28 లక్షలకు సంబంధించిన ప్రామిసరి నోట్, ఒక ఎర్టిగా కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పరకాల కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు వివరించారు.

Source link