వరల్డ్ కప్ క్వాలిఫయర్స్.. నేపాల్‌పై వెస్టిండీస్ ఘన విజయం-icc world cup qualifiers 2023 west indies beat nepal by 101 runs

అనంతరం 340 పరుగుల భారీ స్కోరును ఛేదించేందుకు బరిలో దిగిన నేపాల్ జట్టు(Nepal Team) 49.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఆరిఫ్ షేక్ 93 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 63 పరుగులు చేసి జట్టు తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఇక, రోహిత్ పాడెల్ 43 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేయగా, గుల్సన్ ఝా 58 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 42 పరుగులు చేశాడు. దీపేంద్ర ఐర్ 20 బంతుల్లో 23 పరుగులు, కరణ్ కెసి 27 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 28 పరుగులు చేశారు. కానీ తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. వెస్టిండీస్ జట్టు(West Indies Team) బౌలింగ్‌లో జాసన్ హోల్డర్ 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి 3 వికెట్లు, అల్జారీ జోసెఫ్ 10 ఓవర్లలో 45 పరుగులు చేసి 2 వికెట్లు తీసుకున్నాడు.

Source link